Vinesh Phogat : వినేశ్ ఫొగాట్‌ అన‌ర్హ‌త వేటుపై ఆనంద్ మ‌హీంద్రా సంచ‌ల‌న ట్వీట్..

భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే

Update: 2024-08-07 11:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అధిక బరువు కారణంగా ఆమెపై వేటు పడింది. దీంతో భారత్ ఆమెపై పెట్టుకున్న పతక ఆశలు గల్లంతయ్యాయి.కాగా .. వినేశ్ ఫొగాట్‌ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ కుస్తీ విభాగంలో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. అయితే ఫైనల్లో ఓడినా భారత్‌కు పతకం వచ్చేది.కానీ,గేమ్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది.

ఈ అంశంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెపై వేటు వేసిన వార్త నిజం కాకుంటే బాగుండు అంటూ.. 'X' లో పోస్ట్ చేశాడు . 'నోనోనో.. దీన్ని పీడకలలాగా మార్చండి..' అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది . కాగా ఈ అంశంపై ఇదివరకే పీఎం మోడీతో సహా పలువురు ముఖ్యనాయకులు స్పందించిన విషయం తెలిసిందే. 


Similar News