IND vs BAN 1st Test: ఇండియా-బంగ్లాదేశ్‌ టెస్ట్‌ మ్యాచ్‌.. డిక్లేర్ చేసిన భారత్

ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది.

Update: 2024-09-21 08:04 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య (IND vs BAN, 1st Test) మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచులో భారత్(India) పూర్తిగా పట్టు సాధించడం తో రెండో రోజు 287/4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 227 పరుగుల లీడ్ సాధించగా.. రెండో ఇన్నింగ్స్ లో గిల్ 119 పరుగులు, పంత్ 109 పరుగులు, రాహుల్ 22 పరుగుల చేశారు. దీంతో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి భారత్ మొత్తం 515 పరుగుల భారీ లీడ్ ను సాధించింది. దీంతో భారత్ డిక్లేర్ చేసింది, మరో రెండు రోజుల పాటు మ్యాచ్ మిగిలి ఉండటంతో.. బంగ్లాదేశ్(Bangladesh).. భారత్ ఇచ్చిన భారీ స్కోర్ చేదిస్తుందా.. లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదిలా మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలింగ్ దాటికి పసికూన బంగ్లా జట్టు కేవలం 149 పరుగులకే కుప్పకూలిపోయింది.


Similar News