IND vs BAN, 1st Test: సెంచరీలతో రెచ్చిపోయిన పంత్, గిల్

ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.

Update: 2024-09-21 08:26 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌తో వెనుదిరిగిన గిల్.. తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా రాణించి.. భారీ షాట్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండో ఇన్సింగ్ లో మొత్తం 176 బంతులను ఎదుర్కొన్న గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోపక్క భారత ఫ్యూచర్ స్టార్ రిషబ్ పంత్ తన రోడ్డు ప్రమాదం తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచులో భీకరంగా రెచ్చిపోయాడు. తన ఆట తీరులో ఎటువంటి మార్పు రాలేదని నిరూపిస్తూ.. తనదైన శైలిలో భారీ షాట్లు కొడుతూ.. బంగ్లా బౌలర్లను బౌండరీల వైపు పరుగులు పెట్టించాడు. తాను ఆడుతుంది టెస్ట్ మ్యాచ్ అని మరిచిపోయి.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఈ మ్యాచులో మొత్తం 128 బంతులను ఎదుర్కొన్న పంత్ 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 287/4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ కు 515 పరుగుల లీడ్ దక్కగా.. ఈ మ్యాచులో బంగ్లా జట్టు గెలవాలంటే మిగిలిన రెండు రోజుల్లో వికెట్లు సమర్పించుకోకుండా.. 516 పరుగులు చేయాల్సి ఉంది.


Similar News