US Open : ఈ రోజు నుంచే యూఎస్‌ ఓపెన్‌ స్టార్ట్

టెన్నిస్‌ క్యాలెండర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది.

Update: 2024-08-25 22:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: టెన్నిస్‌ క్యాలెండర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి న్యూయార్క్‌ వేదికగా ఈ టోర్నీ ప్రారంభమవబోతోంది. నేటి నుంచి పురుషుల, మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.పురుషులలో డిఫెండింగ్‌ చాంపియన్ గా సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్‌ జొకోవిచ్‌ బరిలోకి దిగుతుండగా, మహిళల నుంచి అమెరికాకు చెందిన కోకో గాఫ్‌ తన టైటిల్ ను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగుతోంది. పురుషుల కేటగిరీలో కార్లొస్‌ అల్కారజ్‌,డేనియల్‌ మెద్వెదెవ్‌, జన్నిక్‌ సిన్నర్‌ వంటి స్టార్లు టైటిల్‌ వేటలో ఉన్నారు.వీరి నుంచి జకోవిచ్ కు గట్టి పోటీ ఉండబోతోంది. అలాగే మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ఇగా స్వియాటెక్‌, అరీనా సబలెంక, జలెనా ఒస్టపెంకొతో పాటు పారిస్‌ ఒలింపిక్‌ స్వర్ణ విజేత కిన్వెన్‌ జెంగ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా గతేడాది పురుషులలో డేనియల్‌ మెద్వెదెవ్‌, మహిళలలో అరీనా సబలెంక  రన్నరప్ గా నిలిచారు. కాగా తన కెరీర్‌లో ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను నెగ్గిన జొకోవిచ్‌ ఈ ఎడాది 25వ టైటిల్‌ కోసం వేచి చూస్తున్నాడు. జకోవిచ్ ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ క్రీడలలో స్వర్ణ పతకం సాధించాడు . 


Similar News