డబ్ల్యూటీసీలో భారత్ ర్యాంక్ డౌన్
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సర్కిల్ పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది.
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్ పరాజయం పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో వెనుకబడింది. తొలి టెస్టులో ఓటమి టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ పాయింట్లపై ప్రభావం చూపింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సర్కిల్ పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. మ్యాచ్‌కు ముందు భారత్ రెండు ర్యాంక్‌లో ఉండేది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో టీమ్ ఇండియా ఏకంగా మూడు స్థానాలు కోల్పోయి 43.33 శాతం, 26 పాయింట్స్‌తో ఐదు స్థానంలో నిలిచింది. డబ్ల్యూటీసీ 2023-25 సర్కిల్‌లో భారత్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రెండింట ఓడింది. మరో మ్యాచ్ డ్రాగా ముగించింది. మరోవైపు, ఆస్ట్రేలియా 55 శాతం, 66 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో టెస్టులో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయినప్పటికీ ఆసిస్ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లాండ్‌పై మిగతా మ్యాచ్‌ల్లో గెలవడం ద్వారా టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ర్యాంక్‌ను మెరుగుపర్చుకునే అవకాశం ఉంది.