Two Pakistani Boxers Disappear: కామన్వెల్త్‌లో మిస్సింగ్ కలకలం.. ఇద్దరు పాకిస్థాన్ బాక్సర్ల అదృశ్యం..

Two Pakistani boxers disappear from Birmingham after CWG| బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్లు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇప్పటికే కామన్వెల్త్​గేమ్స్‌లో పాల్గొన్న పది మంది శ్రీలంక సభ్యులు అదృశ్యమవ్వగా

Update: 2022-08-11 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Two Pakistani boxers disappear from Birmingham after CWG| బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్లు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇప్పటికే కామన్వెల్త్​గేమ్స్‌లో పాల్గొన్న పది మంది శ్రీలంక సభ్యులు అదృశ్యమవ్వగా.. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన మరో ఇద్దరు బాక్సర్లు కూడా మిస్​అయ్యారు. పాకిస్థాన్‌కు చెందిన బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లాఖాన్ తిరిగి ప్రయాణమయ్యే సమయంలో అదృశ్యమయ్యారని పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ (పీబీఎఫ్‌) అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం పాకిస్థాన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌.. నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పీబీఎఫ్‌ ప్రకటించింది. ప్రస్తుతం పీబీఎఫ్.. బర్మింగ్‌హామ్‌ పోలీసుల సహకారంతో ఆ ఇద్దరి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు. వీరిలో నజీరుల్లాఖాన్ 86-92 కేజీల హెవీవెయిట్‌ విభాగం రౌండ్‌ ఆఫ్‌ 16లో వెనుదిరగగా.. 60-63.5 కేజీల విభాగంలో సులేమాన్‌ రౌండ్‌ ఆఫ్‌ 32లో ఓటమిపాలైనట్లు పీబీఎఫ్‌ పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

Tags:    

Similar News