అండర్-19 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బాక్సర్ క్రిషకు స్వర్ణం
అండర్-19 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ క్రిషా వర్మ అదరగొట్టింది.
దిశ, స్పోర్ట్స్ : అమెరికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ క్రిషా వర్మ అదరగొట్టింది. మహిళల 75 కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో క్రిష 5-0 తేడాతో జర్మనీకి చెందిన సిమోన్ లెరికాను మట్టికరిపించింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె బౌట్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది. క్రిష గెలిచిన స్వర్ణం సహా ఒకే రోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి.
మరో ఐదు రజత పతకాలు దక్కాయి. చంచల్ చౌదరి(మహిళల 48 కేజీలు), అంజలి కుమారి సింగ్(మహిళల 57 కేజీలు), విని(మహిళల 60 కేజీలు) ఆకాంక్ష(మహిళల 70 కేజీలు), రాహుల్ కుండు(పురుషుల 75 కేజీలు) ఫైనల్‌లో ఓడిపోయి సిల్వర్ మెడల్స్‌తో సరిపెట్టారు. అలాగే, మరో ఆరుగురు పతకాలు కూడా భారత్ ఖాతాలో చేరనున్నాయి. ఆరుగురు బాక్సర్లు స్వర్ణ పతకాలపై కన్నేశారు. మహిళల విభాగంలో నిషా(51 కేజీలు), సుప్రియ దేవి(54 కేజీలు), పార్థవి(65కేజీలు), క్రితిక(80 కేజీలు), వన్షిక గోస్వామి(80+ కేజీలు), పురుషుల విభాగంలో హేమంత్ సాగ్వాన్(90 కేజీలు) ఫైనల్ బౌట్‌లో పాల్గొననున్నారు. ఓడినా కనీసం రజతం ఖాయమే.