భారత క్రికెట్‌లో విషాదం: మాజీ కెప్టెన్ కన్నుమూత
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్ దత్తాజీరావు గైఖ్వాడ్(95) మంగళవారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్ దత్తాజీరావు గైఖ్వాడ్(95) మంగళవారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1928 అక్టోబర్ 27న జన్మించిన గైఖ్వాడ్ ..1952 నుంచి1961 మధ్య భారత్ తరపున 11 టెస్టులు ఆడాడు. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు. 1959లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 1961లో చెన్నయ్‌లో పాకిస్థాన్‌తో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. రంజీల్లో బరోడా జట్టుకు సైతం ప్రాతినిధ్యం వహించారు. రంజీల్లో 47.56 సగటుతో 3139 పరుగులు చేయగా.. అందులో 14 సెంచరీలు ఉన్నాయి. గైఖ్వాడ్ మృతి పట్ల బీసీసీఐ సంతాపం తెలిపింది. ‘భారత్ అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్ గైఖ్వాడ్ మృతి బాధాకరం’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. అలాగే భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం సంతాపం వ్యక్తం చేశారు. ‘బరోడా జట్టుకోసం గైఖ్వాడ్ చేసిన కృషి మరవలేనిది. ఆయన ఎంతో మంది యువకులను తీర్చి దిద్దారు. దత్తాజీరావు మరణం క్రికెట్ లోకానికి తీరనిలోటు’ అని పేర్కొన్నారు.