Kho Kho World Cup : ఖోఖో వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్

తొలిసారి భారత్‌లో నిర్వహించనున్న ఖోఖో ప్రపంచ కప్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

Update: 2024-12-18 18:02 GMT

దిశ, స్పోర్ట్స్ : తొలిసారి భారత్‌లో నిర్వహించనున్న ఖోఖో ప్రపంచ కప్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. బుధవారం ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(కేకేఎఫ్ఐ) జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేసింది. ఇండియాలో ఈ గ్లోబల్ ఈవెంట్ నిర్వంచడానికి ఖోఖో ఫెడరేషన్ చూపిన చొరవను సల్మాన్ ఖాన్ ప్రశంసించాడు. మొదటి సారిగా నిర్వహిస్తున్న ఖోఖో ప్రపంచ కప్‌లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నాడు. భారత దేశ స్ఫూర్తికి ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నాడు. తాను కూడా గతంలో ఖోఖో ఆడినట్లు సల్మాన్ ఖాన్ వెల్లడించాడు. ఈ టోర్నీలో 24 దేశాలకు చెందిన 21 పురుషుల జట్లు, 20 మహిళల జట్లు పాల్గొననున్నాయి. భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ ఈవెంట్‌కు పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించింది. 

Tags:    

Similar News