Ashwin : అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయంపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం తాను పెర్త్‌కు వచ్చినప్పుడే తెలిసిందని రోహిత్ శర్మ అన్నాడు.
దిశ, స్పోర్ట్స్ : అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం తాను పెర్త్‌కు వచ్చినప్పుడే తెలిసిందని రోహిత్ శర్మ అన్నాడు. మూడో టెస్ట్ డ్రా అయిన తర్వాత రోహిత్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ‘పింక్ బాల్ టెస్ట్‌లో ఆడాలని అశ్విన్‌ను కోరాను. తన ప్రతిపాదనకు అశ్విన్ అంగీకరించి మూడో టెస్ట్ ప్లేయింగ్-11లో లేకున్నా బరిలోకి దిగాడు. గౌతమ్ గంభీర్‌తో సైతం రిటైర్మెంట్ గురించి అశ్విన్ మాట్లాడాడు. అండర్-17 ఆడినప్పుడే అశ్విన్ నాకు తెలుసు. తొలుగ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగేవాడు. కానీ కొత కాలానికి బౌలర్‌గా రాణించాడు. అశ్విన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. అతను గురువారం ఇండియాకు వెళ్లిపోతున్నాడు.’ అని రోహిత్ అన్నాడు. అతని నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలి. ఇప్పటికే అశ్విన్ చాలా కాలం పాటు క్రికెట్ ఆడాడు. ఆయన తీసుకున్న నిర్ణయానికి జట్టు మద్దతు ఉంటుంది. మూడో టెస్ట్‌లో జడేజాను బరిలోకి దించాం. అశ్విన్ కు అవకాశం ఇవ్వలేక పోయాం. నాకు అవకాశం రానప్పుడు వైదొలగడం మంచిదని అశ్విన్ అనుకొని ఉండొచ్చు అని రోహిత్ అన్నాడు.