Gukesh : గుకేశ్‌కు పన్ను మినహాయింపు ఇవ్వాలి.. ప్రధాని మోడీకి ఎంపీ లేఖ
వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు పన్ను మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు ఎంపీ ఆర్ సుధ డిమాండ్ చేశారు.
దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు పన్ను మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు ఎంపీ ఆర్ సుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆమె బుధవారం లేఖ రాశారు. ‘గుకేశ్ అతి పిన్న వయసులో వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు. రూ.11.45 కోట్లను ప్రైజ్ మనీగా గెలుచుకున్నాడు. ఇందులో రూ.4.8 కోట్లు ట్యాక్స్ రూపంలో కోత పడనుంది. కాంగ్రెస్ పాలనలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, రవి శాస్త్రిలకు పన్ను మినహాయింపు వెసులుబాటు కల్పించారు. అదే విధంగా గుకేశ్‌కు సైతం పన్నును మినహాయించాలి. ఇలా చేయడం ద్వారా అనేక మంది యువకులను ప్రోత్సహించిన వాళ్లమవుతాం.’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం గుకేశ్‌కు రూ.5కోట్లను ప్రోత్సాహకంగా ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. కేంద్రం కూడా గుకేశ్‌కు రూ.5 కోట్లతో పాటు జాతీయ అవార్డును ఇవ్వాలని ఆమె కోరారు. జాతిని గర్వించేలా చేసిన వారికి పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.