క్రికెట్‌కు Ravindra Jadeja గుడ్ బై.. భార్య గెలుపుతో కీలక నిర్ణయం..?
క్రికెట్ లవర్స్‌కు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాడా? త్వరలో జడ్డూ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇంటర్నెట్‌లో సంచలనంగా మారుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ లవర్స్‌కు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాడా? త్వరలో జడ్డూ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇంటర్నెట్‌లో సంచలనంగా మారుతున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి జడేజా భార్య రివాబా జడేజా విజయం సాధించడంతో ఈ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. రివాబా విజయంతో రవీంద్ర జడేజా ఇక క్రికెట్‌కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని.. ఇక తన భార్యతో పాటు ఆయన పూర్తిస్థాయిలో రాజకీయంగా ఫోకస్ పెట్టబోతున్నట్టు ఓ చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. జడేజా మాత్రం ఫిట్ నెస్ కారణాలతో ఆ టూర్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఫిట్ నెస్ కారణంతో లీవ్‌లో ఉన్న జడేజా ఎన్నికల ప్రచారంలో మాత్రం యాక్టివ్‌గా కనిపించారు. దీంతో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. నెటిజన్లు ఆయన వైఖరిని తప్పుపడుతూ ఎన్నికల కోసమే మీమ్మల్ని బంగ్లాదేశ్ టూర్‌కు దూరంగా ఉంచారనే విమర్శలు చేశారు. అయితే ఎన్నికలు పూర్తవడం కౌంటింగ్‌లో తన భార్య భారీ విజయం నమోదు చేసుకోవడంతో ఇకపై జడేజా పాలిటిక్స్ పైనే తన దృష్టినంతా సారించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
జడేజా భార్య రివాబా గెలుపును పురస్కరించుకుని నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇందులో కొంత మంది నెటిజన్లు జడ్డు భాయ్‌ని తిరిగి మైదానంలో చూడగలమా అనే కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీలో ఇటీవల సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారికి ప్రాధాన్యత లభిస్తోంది. గౌతం గంభీర్ ఢిల్లీ స్టేట్ నుంచి ఎంపీగా ఉన్నారు. తాజాగా జడేజా భార్య బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో జడేజా రిటైర్మెంట్‌పై ప్రచారం జోరందుకుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల వ్యూహంలో భాగంగా రివాబాకు మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలు సైతం ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే రవీంద్ర జడేజా క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.
మరి నిజంగానే రిటైర్మెంట్ తీసుకుంటారా లేక రాజకీయాలు వేరు తన ప్రొఫెషనల్ వేరు అంటూ తిరిగి ఇండియన్ జెర్సీ ధరిస్తారా అనేది ఆసక్తిగా మారింది. అన్ని ఫార్మాట్‌లలో బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న జడేజాపై గతంలోనూ పుకార్లు వినిపించారు. జడేజా టెస్టులపై రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాలన్నింటిని ఆయన ఖండిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి తన విషయంలో జరుగుతున్న ప్రచారంపై జడేజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.