Hundred League 2023: సిక్సర్లే సిక్సర్లు.. సూపర్ ​ఫామ్‌లో టీమిండియా ఓపెన‌ర్

హండ్రెడ్ లీగ్‌లో టీమ్​ఇండియా మహిళల జట్టు స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన‌ అదరగొడుతోంది.

Update: 2023-08-03 11:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: హండ్రెడ్ లీగ్‌లో టీమ్​ఇండియా మహిళల జట్టు స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన‌ అదరగొడుతోంది. ఈ లీగ్‌లో అత్యధిక‌ సిక్సర్లు కొట్టిన బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఖాతాలో ప్రస్తుతం 13 సిక్స్‌లు ఉన్నాయి. అంతేకాదు 100 బాల్ టోర్నీలో అత్యధిక‌ హాఫ్ సెంచ‌రీలతో మంధాన‌ భార‌త్‌కే చెందిన జెమీమా రోడ్రిగ్స్‌తో క‌లిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివ‌ర‌కు జెమీమా, మంధాన ఇద్దరూ నాలుగేసి అర్ధ శ‌త‌కాలు బాదారు. డియేండ్ర డాటిన్, నాట్ సీవ‌ర్ బ్రంట్, లారా వాల్వార్డ్త్‌, డానియెల్లె వ్యాట్ మూడు హాఫ్​సెంచ రీలతో రెండో స్థానంలో ఉన్నారు.

స‌థ‌ర్న్ బ్రేవ్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడుతున్న స్మృతి మంధాన ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్​సెంచ‌రీతో అద‌ర‌గొట్టింది. నాటింగ్‌హ‌మ్ వేదిక‌గా జ‌రిగిన పోరులో ట్రెంట్ రాకెట్స్ జ‌ట్టుపై కేవ‌లం 36 బంతుల్లోనే 55 ర‌న్స్ కొట్టింది. ఆమె ఇన్నింగ్స్‌లో రెండు సిక్స్‌లు ఉన్నాయి. దాంతో ఈ లీగ్‌లో మంధాన‌ సిక్సర్ల సంఖ్య 13కు చేరింది.


Similar News