Hima Das: భారత స్ప్రింటర్ హిమా దాస్‌పై తాత్కాలిక నిషేధం..
భారత స్ప్రింటర్ హిమా దాస్‌పై జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) తాత్కాలిక సస్పెన్షన్ విధించింది.
దిశ, వెబ్‌డెస్క్: భారత స్ప్రింటర్ హిమా దాస్‌పై జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. ఏడాది కాలంలో ఆమె మూడుసార్లు డోపింగ్ పరీక్షలకు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గరిష్ఠంగా ఆమెపై రెండేళ్ల నిషేధం విధించే అవకాశాన్నాయి. అయితే దీన్ని ఓ ఏడాదికి కూడా తగ్గించవచ్చు. ఏప్రిల్‌లో ఆమె గాయపడగా అప్పటినుంచి అన్ని ఈవెంట్లకు దూరంగానే ఉంటోంది. తాజాగా ఇదే కారణంతో ఆసియాగేమ్స్ నుంచి కూడా వైదొలిగింది. అస్సాంకు చెందిన 23 ఏళ్ల హిమ 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్ల విభాగంలో రజతం, మహిళల 4 × 400 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించింది.