శుభ్​మన్‌‌ గిల్‌ అరుదైన రికార్డు.. పాక్‌ బ్యాటర్‌ ప్రపంచ రికార్డు బ్రేక్​..

విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్​ఇండియా యువ బ్యాటర్​శుభమన్​గిల్ అరుదైన రికార్డును సాధించాడు.

Update: 2023-08-02 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్​ఇండియా యువ బ్యాటర్ ​శుభమన్ ​గిల్ అరుదైన రికార్డును సాధించాడు. పాక్ బ్యాటర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో శుభమన్​గిల్.. 92 బంతుల్లో 85 పరుగులు చేశాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌తోపాటు సరికొత్త రికార్డును సృష్టించాడు. పాకిస్థాన్​బ్యాటర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో సగటు 62.48తో 1437 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు.

అంతర్జాతీయ వన్డేల్లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించింది ప్లేయర్స్..

శుభ్​మన్‌ గిల్‌- 1437

ఇమాన్‌ ఉల్‌ హక్‌- 1381

రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌- 1353

రియాన్‌ టెన్‌ డొషాటే- 1353

జొనాథన్‌ ట్రాట్‌- 1342


Similar News