ICC ODI Rankings: అదరగొట్టిన ఇషాన్‌ కిషన్‌, కుల్దీప్‌ యాదవ్‌

విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2023-08-02 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తన స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్‌ విభాగంలో ఇషాన్ కిషన్‌ 43వ ర్యాంక్‌, బౌల‌ర్లలో కుల్దీప్ 14వ ర్యాంకు సాధించారు. విధ్వంస‌క ఓపెన‌ర్ ఇషాన్ రెండో టెస్టు, మూడు వ‌న్డేల్లో వ‌రుస‌గా నాలుగు హాఫ్ సెంచ‌రీలు కొట్టాడు. దాంతో 14 స్థానాలు ఎగ‌బాకి 45వ ర్యాంకు సాధించాడు. కుల్దీప్ కూడా ఏకంగా 8 స్థానాలు మెరుగుప‌ర్చుకొని 14 ర్యాంకులో నిలిచాడు. ఈ సిరీస్‌లో కుల్దీప్‌ మూడు వన్డేలు కలిపి 7 వికెట్లు పడగొట్టాడు.

ఇంత‌కుముందు టాప్ 10లో హిట్‌మ్యాన్ 11వ స్థానానికి, 8వ స్థానంలో ఉన్న కోహ్లీ 9వ ర్యాంక్‌కి ప‌డిపోయారు. ఇక బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో గాయంతో వన్డే సిరీస్‌కు దూరమైన మహ్మద్‌ సిరాజ్‌ ఒక స్థానం దిగజారి 677 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం టాప్‌ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. 886 పాయింట్లతో బాబర్‌ ఆజం తొలి స్థానంలో ఉండగా.. వాండర్‌ డుసెన్‌ 777 పాయింట్లతో రెండు, 755 పాయింట్లతో ఫఖర్‌ జమాన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి శుబ్‌మన్‌ గిల్‌ 724 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.


Similar News