నేడు మూడో సమరానికి సిద్ధమవుతున్న Team India

సొంత గడ్డపై టీమిండియా సత్తా చాటుతూ న్యూజిలాండ్ పై వరస రెండు విజయాలను సొంతం చేసుకొని 2-0 తో ఆధిక్యంలో ఉంది.

Update: 2023-01-24 04:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : సొంత గడ్డపై టీమిండియా సత్తా చాటుతూ న్యూజిలాండ్ పై వరస రెండు విజయాలను సొంతం చేసుకొని 2-0 తో ఆధిక్యంలో ఉంది. నేడు మూడో సమరానికి సిద్దమవుతుంది. శ్రీలంక తో జరిగిన వన్డే మ్యాచ్లో కూడా సిరిస్‌ను కైవసం చేసుకుంది. మొదటి వన్డే లో గెలిచి ,రెండో వన్డేలో సిరీస్ ను గెలుచుకుంది. నేడు మూడో వన్డేలో టీమిండియా ఎలాంటి ఆటను ప్రదర్శిస్తుందో చూడాలి. ఈ మ్యాచ్ ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 01:30 గంటలు ప్రారంభమవ్వనుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో ఓపెనర్లదే పై చేయి.. ఓపెనర్లు గట్టిగా నిలబడి జట్టుకు విజయాలను అందిస్తున్నారు. మిడిల్ ఆర్డర్ ఆట తీరు మెరుగ్గా లేదని పలువురు విమర్శిస్తున్నారు. మరి ఈ రోజైన మెరుగు ఆట తీరును కనబరుస్తారో ? లేదన్నది చూడాలి..నేటి మ్యాచ్లో చాహల్ , ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.  

Also Read...

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ 

Tags:    

Similar News