T20 WorldCup: రోహిత్ శర్మ అభిమానులకు సూపర్ న్యూస్

టీ20 వరల్డ్ కప్‌ కోసం టీమిండియా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చేజేతులా స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ కోల్పోవడంతో క్రీడాకారులతో పాటు అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు.

Update: 2024-01-02 14:22 GMT
T20 WorldCup: రోహిత్ శర్మ అభిమానులకు సూపర్ న్యూస్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌ కోసం టీమిండియా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చేజేతులా స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ కోల్పోవడంతో క్రీడాకారులతో పాటు అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో ఎలాగైనా టీ20 వరల్డ్ సాధించాలన్న కసితో అటు బీసీసీఐ, ఇటు క్రీడాకారులు ఉన్నట్లు సమాచారం. అయితే, వరల్డ్ కప్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై అందరికీ అనుమానం నెలకొంది. తాజాగా.. వాటన్నింటికీ కెప్టెన్ రోహిత్ ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చారు.

జనవరి 3వ తేదీ నుంచి సౌతాఫ్రికాతో రెండో టెస్టు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. టీ20 ప్రపంచ కప్ గురించి యాంకర్ ప్రశ్న అడుగుతుండగా.. మధ్యలో రోహిత్ కలుగజేసుకొని ‘మీరే అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. అందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నా’ అని రోహిత్ చెప్పారు. దీంతో టీ20 వరల్డ్ కప్‌కు రోహిత్ సారథ్యం వహిస్తాడనే దానిపై క్లారిటీ వచ్చింది. అటు కోహ్లీ కూడా వరల్డ్ కప్ ఆడటానికి సిద్ధమయ్యారు. అనౌన్స్ మెంట్ కోసం అటు రోహిత్, ఇటు కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు టోటల్ టీమిండియా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News