Champions Trophy : భారత జట్టు ఎంపిక ఆలస్యానికి వారిద్దరే కారణమా?

వచ్చే నెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.

Update: 2025-01-13 13:13 GMT
Champions Trophy : భారత జట్టు ఎంపిక ఆలస్యానికి వారిద్దరే కారణమా?
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. తాత్కాలిక జట్టును ప్రకటించడానికి ఐసీసీ పెట్టిన డెడ్‌లైన్ ఆదివారంతోనే ముగిసింది. జట్టు ఎంపికకు ఇంకాస్త సమయం కావాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్టు తెలుస్తోంది. జట్టులో మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంది. కానీ, బీసీసీఐ మాత్రం జట్టు ఎంపికను ఆలస్యం చేస్తోంది. ఈ నెల 18 లేదా 19న జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. టీమ్ సెలెక్షన్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టీమ్‌కు సవాల్‌గా మారింది. జట్టు ప్రకటన ఆలస్యం కావడానికి స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్‌‌గా లేకపోవడమే కారణమని తెలుస్తోంది.

ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులో బుమ్రా వెన్ను నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అతని గాయం తీవ్రతపై బీసీసీఐ అప్‌డేట్ ఇవ్వలేదు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అతనికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత కుల్దీప్‌కు గజ్జల్లో గాయమైంది. జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్‌‌పై సాధన చేశాడు. అయితే, బుమ్రా, కుల్దీప్ 100 శాతం ఫిట్‌గా లేరని సమాచారం. ఇటీవల అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మీటింగ్‌లో కూడా దీనిపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వారిద్దరూ చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటారా?లేదా? అనేది అనుమానం నెలకొంది. బుమ్రా, కుల్దీప్ ఫిట్‌నెస్‌పై ఓ నిర్ణయానికి వచ్చాకే జట్టును ప్రకటించాలని అనుకుంటున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జట్టులో బుమ్రా పాత్ర గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. మరోవైపు, దుబాయ్ పిచ్‌లపై కుల్దీప్ కీలక పాత్ర పోషిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో వీరి సేవలను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నది.

Tags:    

Similar News