Yograj Singh : యోగ్‌రాజ్ వ్యాఖ్యలపై ఎంక్వైరీకి మహిళా కమిషన్ ఆదేశం
యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్‌సింగ్ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాజ్ గిల్ విచారణకు ఆదేశించారు.
దిశ, స్పోర్ట్స్ : యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్‌సింగ్ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాజ్ గిల్ విచారణకు ఆదేశించారు. యూట్యూబర్ సమ్దిష్ భాటియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్ రాజ్ మాట్లాడారు. ‘మహిళలకు పవర్ ఇస్తే వారు వ్యవస్థను నాశనం చేస్తారు. వారికి ప్రేమ, గౌరవం, మర్యాద ఇవ్వొచ్చు.. కానీ అధికారం ఇవ్వొద్దు. ఇలా అంటున్నందుకు క్షమించండి. ఇందిరా గాంధీ మనల్ని పాలించి దేశాన్ని నాశనం చేశారు. అధికారం పొందిన తల్లులు, మహిళలను చూశాను. వారు కేవలం తమ కోసమే పనిచేస్తారు. మగవారు పంజాబ్‌లోనే మాట్లాడాలి.. హిందీ మాట్లాడితే మహిళలు మాట్లాడినట్లు ఉంటుంది.’ అని యోగ్‌రాజ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో పలువురు యోగ్ రాజ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. యోగ్ రాజ్ సింగ్ వీడియోపై స్పందించిన పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విచారణకు ఆదేశిస్తున్నట్లు సోమవారం వెల్లడించారు.