భారత టెస్ట్ కోచ్‌గా VVS లక్ష్మణ్‌ను నియమించాలి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్

వీవీఎస్ లక్ష్మణ్‌ను టీం ఇండియా టెస్ట్ కోచ్‌గా నియమించాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు.

Update: 2025-01-13 12:08 GMT
భారత టెస్ట్ కోచ్‌గా VVS లక్ష్మణ్‌ను నియమించాలి..  ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : వీవీఎస్ లక్ష్మణ్‌ను టీం ఇండియా టెస్ట్ కోచ్‌గా నియమించాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్‌లు, వన్డేలకు వేర్వేరు కోచ్‌ల అంశంపై సోమవారం ఆయన ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు. ‘గంభీర్‌పై పనిభారం ఎక్కువ అవుతోందని భావిస్తున్నా. అతడు ఇటీవలే కోచ్‌గా మారాడు. కొన్నేళ్ల క్రితం గంభీర్ మా టీమ్ మేట్.. అతడు ఇప్పుడు ఎలా ఆడాలో మాకు చెబుతున్నాడు అని సీనియర్లు భావిస్తూ ఉండొచ్చు. బ్యాటర్‌గా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో గంభీర్ పెద్దగా రాణించలేదు. కోచ్‌గా గంభీర్ సామర్థ్యాలపై సెలక్టర్లు పునరాలోచించాలి. లేదా అతన్ని వన్డేలు, టీ20లపై దృష్టి సారించాలని చెప్పాలి. టెస్ట్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్లను తేవాలి. లేదా బ్యాటింగ్ కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించాలి. లక్ష్మణ్ రాహుల్ ద్రావిడ్‌లా శైలి ఒకేలా ఉంటుంది. అతడు ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించగలడు. లక్ష్మణ్ ఆటగాళ్ల నుంచి గౌరవం పొందగలడు. గంభీర్ విషయంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.’ అని పనేసర్ అన్నాడు.   

Tags:    

Similar News