కోహ్లీకి ఇది కాదు.. ఆ ప్రపంచకప్ చివరిది : క్రిష్ శ్రీకాంత్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు ఇదే చివరి టీ20 వరల్డ్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2024-06-05 16:14 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు ఇదే చివరి టీ20 వరల్డ్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దీనిపై భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. కోహ్లీ ఫిటినెస్ దృష్ట్యా అతను భారతగడ్డపై 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ వరకు ఆడగలడని చెప్పాడు. ‘బహుశా రోహిత్, కోహ్లీలకు ఇదే చివరి చాన్స్ కావొచ్చు. కానీ, ఒక్కసారి ఆలోచిస్తే 2026లో టీ20 వరల్డ్‌ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్నది. ప్రతి ఒక్కరూ ఆ టోర్నీలో ఆడాలనుకుంటారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చూస్తే అతను 2026 వరకు సులభంగా ఆడగలడు. కాబట్టి, కోహ్లీకి ఇది చివరి చాన్స్ కాదు.’ అని చెప్పాడు. కెప్టెన్‌గా రోహిత్ భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించాలన్న కసితో ఉన్నాడని వ్యాఖ్యానించాడు. ‘కెప్టెన్‌గా వరల్డ్ కప్ గెలవడం పెద్ద విషయం. ధోనీ సారథిగా అన్ని మేజర్ టైటిల్స్ గెలిచాడు. అందుకే, అతని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. రోహిత్ తన కంటే దేశం కోసం గెలవాలనుకుంటున్నాడు.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 


Similar News