విరాట్ కాస్త ఓపికగా ఆడు.. : సునీల్ గవాస్కర్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం పెద్దగా ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయారు.

Update: 2024-06-13 17:26 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం పెద్దగా ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయారు. న్యూయార్క్ పిచ్‌ కూడా అందుకు కారణం కావొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం అతని ఫిట్‌నెస్ మరోసారి వేలెత్తి చూపిస్తున్నారు.తాజాగా విరాట్ పేలవ ప్రదర్శనపై భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు.‘ విరాట్ కాస్త ఓపికగా ఆడితే మళ్లీ అతన్ని మనం మునపటిలా చూడొచ్చు. ప్రస్తుతం టీమిండియా లీగ్ దశలోనే ఉంది. ఇంకా సూపర్-8, సెమీప్, ఫైనల్ ఉండనే ఉంది. అతడిలో క్రికెట్ ఇంకా మిగిలే ఉంది’ అని పేర్కొన్నారు. కాగా,విరాట్ కోహ్లీ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.


Similar News