Steve Smith: వందో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డు..

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డు సాధించాడు.

Update: 2023-07-06 13:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డు సాధించాడు. యాషెస్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్టీవ్‌ స్మిత్‌ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ టెస్టులో 22 పరుగులు చేసిన స్మిత్‌ ఇప్పటివరకు 3,226 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌(3222)ను దాటిన స్మిత్‌ మూడో స్థానానికి చేరుకున్నాడు. స్మిత్‌ కంటే ముందు జాక్‌ హాబ్స్‌ (3636) రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో ఆస్ట్రేలియన్‌ దిగ్గజం సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌(5028 పరుగులు) ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.

ఇక స్మిత్‌కు ఇది వందో టెస్టు మ్యాచ్‌ కావడం విశేషం. ఆసీస్‌ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్‌ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చిరకాలం​ గుర్తుండిపోయే తన 100వ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి, మరింత స్పెషల్‌గా మార్చుకోవాలని స్మిత్‌ భావిస్తున్నాడు. ఇప్పటివరకు స్మిత్‌.. తన కెరీర్‌లో 99 టెస్ట్‌లు ఆడగా.. అందుల్లో 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. 59.56 సగటున 9113 పరుగులు చేశాడు.


Similar News