Manu Bhaker : ఒలింపిక్స్‌లో పథకాలు సాధించకుండా ఉండాల్సింది.. : మనుబాకర్ తండ్రి
తాను ఒలింపిక్స్‌కు వెళ్లి పథకాలు సాధించకుండా ఉండాల్సిందని మనుబాకర్ అన్నట్లు తన తండ్రి రామకృష్ణ అన్నారు.
దిశ, స్పోర్ట్స్ : తాను ఒలింపిక్స్‌కు వెళ్లి పథకాలు సాధించకుండా ఉండాల్సిందని మనుబాకర్ అన్నట్లు తన తండ్రి రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన జాతీయ మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. ‘షూటింగ్ రంగంలో కాకుండా తన కూతురుని క్రికెట్‌లో ప్రోత్సహించి ఉండాల్సింది. అప్పుడు అన్నీ అవార్డులు, ప్రశంసలు తనకు దక్కేవి. ఆమె రెండు ఒలింపిక్స్ మెడల్స్‌ను ఒకే ఎడిషన్‌లో సాధించింది. ఇప్పటి వరకు ఈ ఘనతను ఎవరూ సాధించలేదు. దేశం కోసం తన కూతురు ఇంకా ఏం చేయాల్సిందని మీరు భావిస్తున్నారు. ప్రభుత్వం తన సేవలను గుర్తించాలి. మనుతో నేను మాట్లాడాను. జరుగుతున్న పరిణామాలతో తను కలత చెందింది. ‘ఒలింపిక్స్‌కు వెళ్లి దేశం తరఫున పథకాలు సాధించకుండా ఉండాల్సింది. క్రీడాకారిణి కూడా కాకుంటే అయిపోయేది’ అని చెప్పింది.’అని మను బాకర్ తండ్రి అన్నాడు. మను బాకర్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా తన పేరును అవార్డు కోసం నమోదు చేసింది. క్రీడా మంత్రిత్వశాఖ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తోంది. మను బాకర్ పోర్టల్‌లో ఒక వేళ అప్లై చేసుకుని ఉంటే కమిటీ తన పేరును తప్పకుండా పరిశీలించాలి. మనుబాకర్ ఖేల్ తర్నతో పాటు దేశ మూడు, నాలుగో అత్యున్నత పురస్కారాలు పద్మ భూషన్, పద్మ శ్రీలకు సైతం అప్లై చేసుకుంది. సెప్టెంబర్ 15న పద్మ అవార్డులకు పోర్టల్ ద్వారా, పద్మ భూషన్‌కు నేరుగా దరఖాస్తు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.