Shakib Al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబుల్ హసన్..

Update: 2023-08-11 10:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా సీనియర్ ఆటగాడు షకీబుల్ హసన్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. ఈ ఏడాది జరగనున్న న్యూజిలాండ్ సిరీస్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌కు షకీబుల్ హసన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని బీసీబీ అధ్యక్షుడు నజ్యుల్ హసన్ తెలిపారు. తమీమ్ ఇక్బాల్ ఇటీవల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో షకీబ్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఆసియా కప్‌లో ఆడే జట్టును బంగ్లాదేశ్ ఈ నెల 12న ప్రకటించే ఛాన్సుంది.


Similar News