Mohammad Shami: టీమిండియా పేసర్‌‌కి బిగ్ షాక్‌.. అరెస్ట్ స్టే పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

భారత సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ నుంచి విడిగా ఉంటున్న అతడి భార్య హసీన్‌ జహాన్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2023-07-06 13:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ నుంచి విడిగా ఉంటున్న అతడి భార్య హసీన్‌ జహాన్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీన్‌ జహాన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టి నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని పశ్చిమ బెంగాల్‌ సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. ఒకవేళ అది వీలుకాకపోతే స్టే ఆర్డర్‌లో మార్పులు చేయాలని సూచించింది. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

కాగా, షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ.. గృహహింస కేసు పెట్టిన హసీన్‌ జహాన్‌.. అతడి అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టు గురువారం ఆమె పిటిషన్‌పై విచారణ జరిపింది. కేసును సాగదీయకుండా సత్వరమే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్‌ సెషన్స్‌ కోర్టును ఆదేశించింది.


Similar News