టెస్టు జట్టు నుంచి ఆ ఆటగాళ్లను రిలీజ్ చేసిన బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఎంపికైన భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశ్ దయాల్‌లను బీసీసీఐ సోమవారం టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేసింది.

Update: 2024-09-30 19:59 GMT

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఎంపికైన భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశ్ దయాల్‌లను బీసీసీఐ సోమవారం టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేసింది. వారు ఇరానీ కప్ టోర్నీకి అందుబాటులో ఉంటారని తెలిపింది. లక్నో వేదికగా నేటి నుంచి 5వ తేదీ వరకు ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ మ్యాచ్ జరగనుంది. ఇటీవల బీసీసీఐ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జట్టులో వికెట్ కీపర్‌ ధ్రువ్ జురెల్‌, పేసర్ యశ్ దయాల్‌కు చోటు కల్పించింది. అలాగే, సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరపున ఆడతాడని పేర్కొంది. రెండో టెస్టు వీరు ఆడకపోతేనే ఇరానీ కప్‌లో పాల్గొంటారని అప్పుడే తెలిపింది. రెండో టెస్టుకు టీమ్ ఇండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగడంతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశ్ దయాల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. 


Similar News