Asian Games: కెప్టెన్‌గా రుతురాజ్‌.. కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌

చైనాలో జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో పాల్గోనే భార‌త క్రికెట్ జ‌ట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యత‌లు చేప‌డుతున్నాడు.

Update: 2023-09-28 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో పాల్గోనే భార‌త క్రికెట్ జ‌ట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యత‌లు చేప‌డుతున్నాడు. ఆ జ‌ట్టుకు కోచ్‌గా వీవీఎస్ ల‌క్ష్మణ్ కొన‌సాగుతున్నాడు. రుతురాజ్ నేతృత్వంలోని భార‌త బృందం.. హంగ్జూకు బ‌య‌లుదేరి వెళ్లింది. ఆసియా క్రీడ‌ల్లో మ‌హిళా క్రికెట్ జ‌ట్టు స్వర్ణ ప‌త‌కం సాధించిన విష‌యం తెలిసిందే. ఇక పురుషుల క్రికెట్ మ్యాచ్‌ల్లో భార‌త్ ప్రస్థానం అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. అక్టోబ‌ర్ 3వ తేదీ క్వార్టర్స్ స్టేజ్‌లో ఇండియా త‌న తొలి మ్యాచ్ ఆడ‌నున్నది.

క్వార్టర్ ఫైన‌ల్స్ స్టేజ్ నుంచి ఇండియా ఎంట్రీ ఉంటుంది. ఇవాళ సాయంత్రం వ‌ర‌కు ఇండియ‌న్ జ‌ట్టు చైనాకు చేరుకోనున్నది. రేప‌టి నుంచి ఆ జ‌ట్టు ప్రాక్టీసు మొద‌లుపెడుతుంది. అయితే ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో ముగిసిన వ‌న్డే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌, వాషింగ్టన్ సుంద‌ర్‌లు ఆడారు. ఆసియా క్రీడ‌ల్లో సీడింగ్ ప్రకారం.. భార‌త్ త‌న తొలి మ్యాచ్‌ను క్వార్టర్స్ స్టేజ్ నుంచి ఆడ‌నున్నది. నేరుగా క్వార్టర్స్ ఆడుతున్న జ‌ట్లలో.. ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక జ‌ట్లు ఉన్నాయి.

భార‌త్ జ‌ట్టు:

రుతురాజ్ గైక్వాడ్‌(కెప్టెన్‌), ముకేశ్ కుమార్‌, శివం మావి, శివ‌మ్ దూబే, ప్రభుసిమ్రన్ సింగ్‌(కీప‌ర్‌), య‌శ‌స్వి జైస్వాల్‌, రాహుల్ త్రిపాఠి, తిల‌క్ వ‌ర్మ, రింకూ సింగ్‌, జితేశ్ శ‌ర్మ(కీప‌ర్), వాషింగ్టన్ సుంద‌ర్‌, షాబాజ్ అహ్మద్‌, ర‌వి బిష్ణోయ్‌, అవేశ్ ఖాన్‌, అర్షదీప్‌సింగ్‌.

Similar News