T20 Rankings :హర్మన్‌ప్రీత్ ర్యాంక్ మెరుగు.. స్మృతి మంధాన, రోడ్రిగ్స్, దీప్తి ర్యాంక్‌లు డౌన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది.

Update: 2024-10-08 19:21 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. మంగళవారం ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. బ్యాటింగ్ విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకిన హర్మన్‌ 12వ ర్యాంక్‌కు చేరుకుంది. అలాగే, స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఏకంగా 9వ స్థానాలను అధిగమించింది. 29వ ర్యాంక్‌లో నిలిచింది. మిగతా భారత ప్లేయర్లు తమ ర్యాంక్‌లను నిలుపుకోలేకపోయారు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక్క స్థానం కోల్పోయి 5వ ర్యాంక్‌కు పడిపోగా.. జెమిమా రోడ్రిగ్స్ 2 స్థానాలను నష్టపోయి 20వ ర్యాంక్‌కు చేరింది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బౌలింగ్ విభాగంలో రెండు స్థానాలు, ఆల్‌రౌండర్ విభాగంలో ఒక్క స్థానం కోల్పోయి రెండు విభాగాల్లోనూ 4వ స్థానంలో ఉన్నది. బౌలర్లు రాధా యాదవ్(15), పూజ వస్త్రాకర్(28) తమ స్థానాలను కాపాడుకోలేకపోయారు. 

Tags:    

Similar News