Ronaldo Instagram Followers: ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో నయా రికార్డు..

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఓ అరుదైన రికార్డు సాధించాడు.

Update: 2023-08-11 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను సంపాదించికున్న వ్యక్తిగా రికార్డుకెక్కాడు. 60 కోట్ల ఫొలోవర్లను సొంతం చేసుకున్నాడు. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు అతడి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 15 కోట్లు పెరగడం విశేషం. 14 నెలల్లోనే 34 శాతం మంది ఫాలోవర్లు పెరిగారని 'సోషల్ బ్లేడ్' సర్వే వెల్లడించింది. రొనాల్డో తాను ఇన్‌స్టాలో చేసే ఒక్కో పోస్టుకు సుమారు 28 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.19 కోట్లు డిమాండ్ చేస్తుండటం విశేషం. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం.. ప్రస్తుతం రొనాల్డో ఆస్తుల విలువ 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.4100 కోట్లు). ప్రపంచంలోని అత్యంత సంపన్న అథ్లెట్లలో రొనాల్డో కూడా ఒకడు.


Similar News