Yuvraj Singh: ఐసీసీ టైటిల్‌ నెగ్గాలంటే మంచి కెప్టెన్‌ ఉంటే పోదు.. భారత జట్టుపై యువరాజ్ సింగ్ కీలక వాఖ్యలు

వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును ఉద్దేశించి టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ కీలక వాఖ్యలు చేశాడు.

Update: 2023-08-08 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును ఉద్దేశించి టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ కీలక వాఖ్యలు చేశాడు. జట్టుకు మంచి కెప్టెన్‌ ఉంటే సరిపోదని, కీలక ఆటగాళ్లు కూడా ఉండాలని యువీ అన్నాడు. "రోహిత్ శర్మ మంచి కెప్టెన్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముంబై ఇండియన్స్‌కు చాలా సీజన్ల నుంచి సారధిగా వ్యవహరిస్తున్నాడు. అతడు ముంబై జట్టుకు ఐదు టైటిల్స్‌ను అందించాడు. రోహిత్‌ గొప్ప లీడర్‌గా మారాడు. అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ ఉన్నాయి. ఒత్తిడిలో కూడా చాలా తెలివిగా రోహిత్‌ వ్యవహరిస్తాడు.

అయితే ఐసీసీ టైటిల్‌ నెగ్గాలంటే మంచి కెప్టెన్‌ ఉంటే పోదు, అత్యుత్తమ జట్టు కూడా ఉండాలి. అందులో అనుభవం ఉన్న ఆటగాళ్లు భాగం కావాలి. ఆ బాధ్యత సెలక్టర్లు తీసుకోవాలి. భారత్‌కు రెండు టైటిల్స్‌ను అందించిన ధోని కూడా అత్యుత్తమ కెప్టెన్‌. కానీ ధోనికి అనుభవం ఉన్న ఆటగాళ్లు సపోర్ట్‌ కూడా ఉండేది. అయితే ఈ సారి సరైన జట్టుతో బరిలోకి దిగకపోతే విజయం సాధించడం కష్టమే" అని యువీ పేర్కొన్నాడు. భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు సమయం దగ్గరపడుతోంది. ఆక్టోబర్‌ 5న చెన్నై వేదికగా న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ మధ్య జరగనునున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ షురూ కానుంది.


Similar News