దిశ, వెబ్‌డెస్క్: యాక్సిడెంట్ కారణంగా గాయపడిన రిషబ్ పంత్ కొన్ని నెలలు ఆటకి దూరంగా ఉండబోతున్న విషయం తెలిసిందే. దాంతో ఐపీఎల్ 2023 కోసం అతని స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ బెంగాల్ ప్లేయర్‌ని టీమ్‌లోకి తీసుకోబోతోంది. అయితే, తాజాగా పంత్ స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. రంజీ ట్రోఫీలో వికెట్ కీపర్‌గా అదరగొట్టేసిన బెంగాల్‌కు చెందిన అభిషేక్ పోరెల్‌ను ఎంపిక చేసిన్నట్లు ప్రకటించింది.
అభిషేక్ పోరెల్ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వికెట్ కీపింగ్‌తో పాటు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. గతేడాది అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించాడు. అతను ఇప్పటి వరకు 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాగా.. 695 పరుగులు చేశాడు. అందులో 6 అర్ధ సెంచరీలు సాధించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎన్‌గిడి ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఫిల్ సాల్ట్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసోవ్, రిపాల్ పటేల్, అభిషేక్ పోరెల్