Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్..

టీమ్ ​ఇండియా స్టార్​వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం తన గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.

Update: 2023-08-04 17:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ​ఇండియా స్టార్​వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం తన గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా అతను నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. గంటలకు 140 కి.మీ. పైగా వేగంతో విసిరే బంతులను కూడా పంత్ ఎదుర్కొంటున్నాడట. గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రిషబ్.. మూడు సర్జరీలు చేయించుకుని బెడ్​రెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది నెలల పాటు ఇంట్లోనే ఉన్న పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తన ఫ్యాన్స్​కోసం అప్పడప్పుడు తన హెల్త్ ​అప్డేట్​ ఇన్తూ వచ్చాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా అతను నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. గంటకు 140 కి.మీ. కిపైగా వేగంతో విసిరే బంతులను కూడా పంత్ ఎదుర్కొంటున్నాడట. అయితే ఇప్పట్లో ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగొచ్చేంత ఫిట్‌నెస్ మాత్రం సాధించలేదని వైద్యులు చెప్తున్నారు.

"రిషబ్ రికవరీ మెరుగ్గా ఉంది. గంటకు సుమారు 140 కి.మీ.కు పైగా వేగంతో విసిరే బంతులను సైతం అతడు ఎదుర్కొంటున్నాడు. తన రికవరీలో వస్తున్న ప్రతి అడ్డంకిని పంత్​ అధిగమించడం చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది. అతడు బాగున్నాడు. ఇక శరీరాన్ని వేగంగా అటూ ఇటూ కదిలించడమే అతని తర్వాతి లక్ష్యం. వచ్చే రెండు నెలల్లో ఈ విషయంపై దృష్టి సారిస్తాం" అంటూ ఎన్‌సీఏ వర్గాలు తాజాగా వెల్లడించాయి.


Similar News