RCB: ఇన్‌స్టాగ్రామ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త రికార్డు..ఆ మార్క్ దాటిన రెండో ఐపీఎల్‍ టీమ్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) చెత్త రికార్డు మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-02 15:44 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని పురుషుల జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) చెత్త రికార్డు మూటగట్టుకున్న విషయం తెలిసిందే.అయితే ఆ జట్టు సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఓ రికార్డు క్రియేట్ చేసింది.ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో తన పేరిట కొత్త చరిత్రను సృష్టించింది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జట్టు 15 మిలియన్ల ఫాలోవర్లను చేరుకుంది.దీంతో ఇన్‍స్టాలో ఈ మార్క్ సాధించిన రెండో ఐపీఎల్‍ జట్టుగా RCB నిలిచింది.కాగా చెన్నై సూపర్ కింగ్స్(CSK) 16 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉంది.ఆ తర్వాత ముంబై ఇండియన్స్(14.1M),కోల్‌కతా నైట్ రైడర్స్ (6.4M),సన్‌రైజర్స్ హైదరాబాద్(4.4M),రాజస్థాన్ రాయల్స్(4.4M),గుజరాత్ టైటాన్స్(4M),ఢిల్లీ క్యాపిటల్స్(3.9M),పంజాబ్ కింగ్స్(3.3M),లక్నో సూపర్ జెయింట్స్(3.2M) ఉన్నాయి.


Similar News