MS Dhoni Birthday: 'మహీ భాయ్‌'.. అంటూ రవీంద్ర జడేజా ఎమోషనల్‌ ట్వీట్‌..

నేడు (జూలై 7) టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పుట్టినరోజు.

Update: 2023-07-07 09:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు (జూలై 7) టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పుట్టినరోజు. మిస్టర్‌ కూల్‌ నేటితో 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ధోనితో జడ్డూకు ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ధోని బర్త్‌డేను సందర్భంగా..‘‘2009 నుంచి ఇప్పటి వరకు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఎలాంటి అవసరం వచ్చినా.. సలహాలు, సూచనలు కావాలన్నా నేను మొదటగా సంప్రదించే వ్యక్తి(My Go To Man). పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ భాయ్‌. మళ్లీ నిన్ను త్వరలోనే ఎల్లో జెర్సీలో చూడాలి’’ అని ట్వీట్‌ చేసిన రవీంద్ర జడేజా #respect జతచేశాడు.

ధోని సేన ఐపీఎల్‌-2023లో ఏకంగా చాంపియన్‌గా నిలిచింది. తద్వారా 5 వ సారి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఇక రిజర్వ్‌ డే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్లో ఫోర్‌ బాది సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చిన జడ్డూను ధోని అభినందించిన తీరును అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.


Similar News