WTC 2025 : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పోటీలపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు గందరగోళంగా ఉన్నాయని.. టూ-టైర్ ఫార్మాట్ రావాలని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించారు.

Update: 2025-01-01 14:49 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు గందరగోళంగా ఉన్నాయని.. టూ-టైర్ ఫార్మాట్ రావాలని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించారు. ఆస్ట్రేలియా పత్రికలో రాసిన ఓ వ్యాసంలో ఆయన ఈ మేరకు అభిప్రాయపడ్డాడు. ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ద్వారా టెస్ట్ క్రికెట్‌కు లాభం చేకూరుతుంది. అయితే ఇందులో మార్పులు అవసరం. ఐసీసీ ర్యాంకుల ఆధారంగా మ్యాచ్‌లను షెడ్యూల్ చేయాలి. 6 నుంచి 8 జట్ల మధ్య పోటీలు నిర్వహించాలి. అత్యుత్తమంగా ఆడిన టీమ్‌లు ముందుకెళ్తాయి. సరిగ్గా ఆడకపోతే టోర్నీ నుంచి వెళ్లిపోతాయి. భారీ సంఖ్యలో అభిమానులు రావాలంటే గట్టి పోటీనిచ్చే జట్లు తలపడాలి. టెస్ట్‌లకు ఐదురోజులు అవసరమని మెల్‌బోర్న్ టెస్ట్‌తో క్లారిటీ వచ్చింది. టూ-టైర్ సిస్టమ్ లేకపోతే ఐదు రోజుల వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లలేం.అప్పుడు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ గురించి డిస్కషన్ వస్తుంది.’ అని రవిశాస్త్రి అన్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌‌ను వీక్షించేందుకు ఐదు రోజుల్లో మొత్తం 3,73,691 మంది అభిమానులు వచ్చారు. 1936-37లో యాషెస్ మ్యాచ్ చూసేందుకు 3,50,534 మంది వచ్చారు. టెస్ట్ క్రికెట్‌కు ఇన్నేళ్ల తర్వాత కూడా ఆదరణ భారీగా రావడంతో రవిశాస్త్రి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విషయంలో ఐసీసీకి ఈ మేరకు సూచనలు చేశాడు. 

Tags:    

Similar News