PV Sindhu BWF Rank: పీవీ సింధు డీలా.. పదేళ్లలో లోయస్ట్ ర్యాంక్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు తీవ్ర నిరాశ ఎదురైంది.

Update: 2023-07-18 12:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు తీవ్ర నిరాశ ఎదురైంది. పీవీ సింధు ర్యాంకింగ్స్‌లో డీలా పడిపోయింది. గత మూడేళ్లుగా వరుస పరాజయాలతో వైఫల్యాల ఊబిలో కూరుకుపోయింది. సీజన్.. సీజన్‌కూ ర్యాంకింగ్స్‌లో దిగజారిపోతూ వస్తోంది. తాజాగా విడుదలైన బీడబ్ల్యూఎఫ్​ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంక్​పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఐదు స్థానాలు దిగజారి ప్రపంచ 17వ ర్యాంక్‌కు చేరింది. గతేడాది కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సింధు.. ఆ తర్వాత గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరమైంది. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చినా సత్తా చాటలేకపోతోంది. వరుస టోర్నీల్లో ప్రారంభ రౌండ్లలోనే ఓటమిపాలైంది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో సింధు చోటు కోల్పోయింది.


Similar News