ఆఖర్లో అభిషేక్ మెరుపులు.. పంజాబ్ ముందు ఢిల్లీ పెట్టిన లక్ష్యం ఎంతంటే?

ఐపీఎల్-17లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడినా ఆఖరికి పోరాడే స్కోరే సాధించింది.

Update: 2024-03-23 12:02 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడినా ఆఖరికి పోరాడే స్కోరే సాధించింది. పంజాబ్ ముందు 175 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 174 పరుగులు చేసింది.

ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పొరెల్(32 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. 10 బంతుల్లో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టులో షాయ్ హోప్(33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. డేవిడ్ వార్నర్(29), మిచెల్ మార్ష్(20), అక్షర్ పటేల్(21) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ దాదాపు 15 నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడాడు. రీఎంట్రీ మ్యాచ్‌లో అతను నిరాశపరిచాడు. 13 బంతుల్లో 18 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. రబాడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్‌లకు చెరో వికెట్ దక్కింది.

Tags:    

Similar News