PKL : తెలుగు టైటాన్స్ సంచలన నిర్ణయం.. స్టార్ ఆటగాడిపై వేటు

ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ వేలానికి ముందు తెలుగు టైటాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-06 12:37 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ వేలానికి ముందు తెలుగు టైటాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ పవన్ సెహ్రావత్‌‌ను రిలీజ్ చేసింది. 10వ సీజన్‌లో పవన్ నాయకత్వంలో టైటాన్స్ పేలవ ప్రదర్శన చేసి 12వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే అతనిపై వేటు వేసినట్టు తెలుస్తోంది. పవన్ సెహ్రావత్‌తోపాటు ప్రదీప్ నర్వాల్, ఫజల్ అత్రాచలి, మనిందర్ సింగ్, మహమ్మద్ రెజా షౌద్లౌయ్ చియానెహ్ వంటి స్టార్ ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు.

12 ఫ్రాంచైజీలు మంగళవారం తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఆయా ఫ్రాంచైజీలు మూడు విభాగాల్లో మొత్తం 88 మంది ప్లేయర్లను అంటిపెట్టుకున్నాయి. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్‌ సహా 12 మందిని రిలీజ్ చేసింది. శంకర్ గడై, అజిత్ పవార్, అంకిత్, ఓంకార్ పాటిల్, ప్రాఫుల్ జవారె, సంజీవి‌లను రిటైన్ చేసుకుంది. మరోవైపు, 10వ సీజన్ విజేత పుణేరి పల్టాన్స్ గత సీజన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచిన అస్లామ్ ఇనామ్దార్‌ను, జైపూర్ పింక్ పాంథర్స్ అర్జున్ దేశ్వాల్, దబాంగ్ ఢిల్లీ కే.సీ అషు మాలిక్, నవీన్ కుమార్‌లను అంటిపెట్టుకున్నాయి. కాగా, పీకేఎల్ 11 వేలం ఈ నెల 15, 16 తేదీల్లో ముంబైలో జరగనుంది. ఆక్షన్‌లో 500కిపైగా ప్లేయర్లు పాల్గొననున్నారు. 

Tags:    

Similar News