Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం.. ఆస్ట్రేలియన్ అథ్లెట్‌కు పాజిటివ్

మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం రేపింది.

Update: 2024-07-23 13:17 GMT

దిశ, స్పోర్ట్స్ : మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం రేపింది. ఆస్ట్రేలియా అథ్లెట్ల బృందంలో ఓ మహిళా అథ్లెట్ కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఒలింపిక్ టీమ్ చీఫ్ అన్నా మీరెస్ మంగళవారం తెలిపింది. కరోనాకు గురైన అథ్లెట్‌ను వాటర్ పోలో ప్లేయర్‌గా గుర్తించారు. అయితే, అథ్లెట్ పేరును బయటపెట్టలేదు. ఆ అథ్లెట్‌ను ఐసోలేషనల్‌లో ఉంచినట్టు అన్నా మీరెన్ తెలిపింది.

అలాగే, ఆమెతో సన్నిహితంగా ఉన్న వారిని కూడా పరీక్షించినట్టు పేర్కొంది. ‘సదరు అథ్లెట్ ప్రత్యేకంగా అస్వస్థతకు గురి కాలేదు. అతను ఓ సింగిల్ రూంలో ఉన్నాడు. మెరుగైన చికిత్స అందిస్తున్నాం.’ అని వెల్లడించింది. దీనిపై ఫ్రెంచ్ హెల్త్ మినిష్టర్ ఫ్రెడరెక్ వాలెటౌక్స్ స్పందిస్తూ.. ఫ్రాన్స్‌లో మేజర్ కొవిడ్ క్లస్టర్ వచ్చే ప్రమాదం లేదని చెప్పారు. ‘ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొవిడ్ వ్యాప్తి తక్కువగానే ఉంది. నిర్వాహకులపైనే ఆధారపడి ఉంటుంది.’ అని పేర్కొన్నారు. కాగా, కరోనా కారణంగా 2020లో జరిగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ఏడాది ఆలస్యంగా నిర్వహించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News