కశ్మీర్ ట్రిప్ గురించి సచిన్ పోస్ట్.. ఇన్ క్రెడిబుల్ ఇండియాపై మోడీ రిప్లై
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కశ్మీర్ లో కుటుంబంతో సరదాగా గడిపాడు. తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి గుల్ మర్గ్ లో స్నోను ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కశ్మీర్ లో కుటుంబంతో సరదాగా గడిపాడు. తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి గుల్ మర్గ్ లో స్నోను ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవే కాకుండా స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించాడు. పుల్వామా జిల్లాలోని విల్లో బ్యాట్ తయారీ యూనిట్ కు వెళ్లారు. పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ ఇంటికి వెళ్లాడు. ఆమీర్ హుస్సేన్ కు బ్యాట్ ను బహుకరించారడు స్థానికులతో కలిసి క్రికెట్ ఆడటమే కాకుండా.. అక్కడున్న జవాన్లతో కలిసి మాట్లాడాడు.
కశ్మీర్ పర్యటన తన జ్ఞాపకాల్లో అందమైన అనుభవంగా మిగిలిపోతుందన్నారు. చుట్టూ మంచు ఉంది.. అయినప్పటికీ ఇక్కడి ప్రజల ఆతిథ్యం ముందు చలిని తట్టుకోవడం చాలా తేలిక అన్నారు. దేశంలో చూడాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయని మోడీ అన్నారని.. ఈ ట్రిప్ తర్వాత అది నిజమని నమ్ముతున్నానని స్పష్టం చేశారు. కశ్మీర్ విల్లో బ్యాట్లు.. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’కు గ్రేట్ ఎగ్జాంపుల్ అన్నారు. విల్లో బ్యాట్లను ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడుతున్నారన్నారు. ఇన్ క్రెడిబుల్ ఇండియాలో ఒకటైన జమ్ముకశ్మీర్ ను సందర్శించాలని ప్రజలను కోరారు.
సచిన్ వీడియోపై సోషల్ మీడియాలో ప్రధాని మోడీ స్పందించారు. ఈ క్రికెట్ గాడ్ ను కొనియాడారు. సచిన్ పర్యటన గురించి యువత రెండు విషయాలు తెలుసుకోవాలని సూచించారు. ఒకటి ఇన్ క్రెడిబుల్ ఇండియాలోని వివిధ ప్రాంతాలను సందర్శించాలన్నారు. రెండోది మేక్ ఇన్ ఇండియా ప్రాముఖ్యత అన్నారు. వికసిత, ఆత్మనిర్భర్ భారత్ ను అందరం కలిసి నిర్మిద్దాం అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు మోడీ.