దిశ, వెబ్డెస్క్: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా లాహొర్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టీ20లో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. 164 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్ (23 బంతుల్లో 60) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. పాకిస్తాన్ విజయం సాధించలేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే, రవీంద్ర తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్(64) పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్, అఫ్రిది రెండు వికెట్లు సాధించగా.. షాదాబ్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు