ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వేదికపై ఐసీసీ సీఈవో కీలక వ్యాఖ్యలు

వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-12 18:31 GMT

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాక్‌కు భారత జట్టును పంపించడానికి బీసీసీఐ ఆసక్తిగా లేదని తెలుస్తోంది. దీంతో పాక్ నుంచి టోర్నీ తరలిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలను ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెఫ్ అలార్డెస్ కొట్టిపారేశారు.

దుబాయ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వేదికను పాక్ నుంచి తరలించే ఆలోచన లేదన్నారు. టోర్నీలో పాల్గొనేందుకు ఏ జట్టూ విముఖత వ్యక్తం చేయలేదని చెప్పారు. సవాళ్లు ఉన్నప్పటికీ అన్ని జట్లు పాక్‌లో ఆడేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

కాగా, టోర్నీలో భారత జట్టు పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. భారత ప్రభుత్వం అనుమతిస్తేనే జట్టును పంపిస్తామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపిన విషయం తెలిసిందే. అయితే, టోర్నీని ఆసియా కప్ తరహాలో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే అవకాశం లేకపోలేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొంతకాలంగా భారత్, పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఇరు జట్లు 2012లో భారత్‌లో చివరి ద్వైపాక్షిక సిరీస్ ఆడాడు. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా చివరిసారిగా పాక్‌లో పర్యటించింది.

Tags:    

Similar News