ధోనీకి దక్కని చోటు.. ఆల్‌ టైం టీమిండియా జట్టును ప్రకటించిన దినేశ్ కార్తీక్

భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ గురువారం టీమ్ ఇండియా ఆల్‌ టైం బెస్ట్ జట్టును ప్రకటించాడు.

Update: 2024-08-15 16:56 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ గురువారం టీమ్ ఇండియా ఆల్‌ టైం బెస్ట్ జట్టును ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేశాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల నుంచే ఐదుగురిని సెలెక్ట్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు స్థానం కల్పించాడు. క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్‌ జట్టులోకి తీసుకున్నాడు.

రోహిత్, సెహ్వాగ్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేయగా..ద్రవిడ్, సచిన్, కోహ్లీ, యువరాజ్‌లను మిడిలార్డర్‌లో తీసుకున్నట్టు చెప్పాడు. ఆల్‌రౌండర్ కోటాలో యువరాజ్‌తోపాటు జడేజాను ఎంపిక చేసిన దినేశ్ కార్తీక్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అశ్విన్, కుంబ్లేలను ఎంచుకున్నాడు. జట్టులో ఇద్దరు పేసర్లకు మాత్రమే చాన్స్ ఇచ్చిన అతను.. జహీర్ ఖాన్‌, బుమ్రాలకు చోటు కల్పించాడు. 12వ ఆటగాడిగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే, టీమిండియాకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కార్తీక్ విస్మరించడం గమనార్హం. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు దినేశ్ కార్తీక్ జట్టులో చోటు దక్కలేదు.

దినేశ్ కార్తీక్ ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్ : వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్‌ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.


Similar News