వన్డే క్రికెట్‌లో మరో తుఫాన్ సెంచరీ.. 14 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్..

Update: 2023-03-21 12:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన సెంచరీ చేశాడు. కేవలం 60 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. షకీబ్ అల్ హసన్ 14 ఏళ్ల రికార్డును ముష్ఫికర్ రహీమ్ బద్దలు కొట్టాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తరఫున అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది.

2009లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో షకీబ్ అల్ హసన్ 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ చేసిన వేగవంతమైన సెంచరీ ఇదే. కానీ, ఇప్పుడు షకీబ్ అల్ హసన్ రికార్డును ముష్ఫికర్ రహీమ్ బద్దలు కొట్టాడు. వన్డే ఫార్మాట్‌లో 7 వేల పరుగులు చేరుకున్న మూడో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం రాలేదు.

Tags:    

Similar News