135 మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడిన టెన్నిస్ ప్లేయర్..
మొరాకో టెన్నిస్ ప్లేయర్ యూనెస్ రచిడి 135 మ్యాచ్ ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినట్లు తేలింది.
న్యూఢిల్లీ: మొరాకో టెన్నిస్ ప్లేయర్ యూనెస్ రచిడి 135 మ్యాచ్ ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటి ఏజెన్సీ (ఐటిఐఏ) అతనిపై జీవిత కాల నిషేధపు వేటు వేసింది. రచిడి కెరీర్‌లో అత్యధిక 473 డబుల్స్ ర్యాంక్‌ను కూడా సాధించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినందుకు రచిడికి ఐటిఐఏ 34 వేల డాలర్ల జరిమానా కూడా విధించింది. అంతేకాదు ఎటువంటి కోచింగ్ పదవిలో కొనసాగకూడదని పేర్కొంది. టెన్నిస్ ఈవెంట్స్‌లో పాల్గొనకూడదని స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీలు నిర్ణయించాయి. 'ఒక వ్యక్తి 135 నేరాలకు పాల్పడటం ఇది అత్యధికం. గతంలో ఎవ్వరూ ఇన్ని నేరాలకు పాల్పడ లేదు' అని ఐటిఐఏ పేర్కొంది.