హంపి, హారిక గేమ్‌లు డ్రా
మహిళల గ్రాండ్ ప్రిక్స్ చెస్ టోర్నీలో భాగంగా జరుగుతున్న థర్డ్ లెగ్ 10వ రౌండ్లో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక డ్రా చేసుకున్నారు.
న్యూఢిల్లీ : మహిళల గ్రాండ్ ప్రిక్స్ చెస్ టోర్నీలో భాగంగా జరుగుతున్న థర్డ్ లెగ్ 10వ రౌండ్లో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక డ్రా చేసుకున్నారు. మంగళవారం జార్జియా గ్రాండ్‌మాస్టర్ బట్సియాష్విలితో హంపి 44 ఎత్తుల్లో గేమ్‌ను డ్రా చేసుకోగా.. రష్యా క్రీడాకారిణి ఎకటేరినా లగ్నోతో జరిగిన గేమ్‌లో హారిక 30 పాయింట్లను పంచుకుంది. మరో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి.. చైనా క్రీడాకారిణి జు జినర్ చేతిలో పరాజయం పాలైంది.
టోర్నీలో హంపి 4 పాయింట్లతో 6వ స్థానంలో ఉండగా.. హారిక(3.5) 8వ స్థానంలో, వైశాలి(3) 9వ స్థానంలో ఉన్నది. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోరియాచ్కినా(5.5) టాప్‌లో ఉన్నది. జర్మనీలో జరిగిన సెకండ్ లెగ్‌లో హంపి రెండో స్థానంలో నిలిచింది. టోర్నీలో మరో రౌండ్ మాత్రమే మిగిలి ఉన్నది. ఆఖరి రౌండ్లో ఆమె గెలిచినా టాప్-3లో నిలిచే అవకాశాలు లేవు. మొత్తంగా గ్రాండ్ పిక్స్‌లో టోర్నీలో హంపి 130 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నది.