KL Rahul లవ్ మ్యారేజ్.. హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే!
క్రికెటర్లతో చాలా మంది హీరోయిన్లు ప్రేమాయణం సాగించారు.
దిశ, వెబ్ డెస్క్: క్రికెటర్లతో చాలా మంది హీరోయిన్లు ప్రేమాయణం సాగించారు. కొంత మంది మాత్రం పెళ్లి పీటలెక్కి తమ ప్రేమను జీవితాంతం పంచుకునేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ సైతం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టితో ప్రేమలో ఉన్నారు. ఈ జంట త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుంది. ఇదే విషయాన్ని ఇటీవల ఓ సదర్భంలో పెళ్లి విషయాన్ని సునీల్ శెట్టి ధృవీకరించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు ఎవరో ఓ సారి చూసేద్దాం.
విరుష్క నుంచి పటౌడీ వరకు..
ఈ జనరేషన్లో క్యూట్ కపుల్‌గా పేరు గాంచిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత 2017 డిసెంబర్ 11న విరుష్కా జోడి పెళ్లితో ఒక్కటయ్యారు. హర్ధిక్ పాండ్యా బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కాగా ఈ జంటకి పెళ్లికి ముందే బాబు(అగస్త్య) జన్మించాడు. భారత దిగ్గజ బౌలర్ హర్భజన్ సింగ్ నటి గీతా బస్రాను ప్రేమించి 29 అక్టోబర్ 2015లో వివాహమాడారు. ఇండియన్ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ సాగరికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సైతం బాలీవుడు నటి హెజెల్ కీచ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాటి తరంలో క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Also Read...
IPL 2023: ఢిల్లీకి కొత్త కెప్టెన్.. రేసులో ఇద్దరు స్టార్ ప్లేయర్స్..!!