కేఎల్ రాహుల్ గాయంపై కీలక అప్‌డేట్.. సర్జరీ సక్సెస్

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయంపై సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ అప్‌డేట్ ఇచ్చాడు.

Update: 2023-05-10 10:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయంపై సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టైమ్‌లో రాహుల్ కండరాలకు గాయమైన సంగతి తెలిసిందే. శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా తను ఆడటం లేదని ప్రకటించాడు. అయితే గాయంపై రాహుల్ స్పందిస్తూ.. 'నా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నేను కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకున్న వైద్యులు, మెడికల్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. ఇప్పుడు నేను అధికారికంగా రికవరీ రోడ్‌లో పడ్డా. మళ్లీ నా బెస్ట్‌కు తిరిగొచ్చి, స్టేడియంలో దిగాలనే పట్టుదలతో ఉన్నా' అని చెప్పాడు. ఈ విషయాన్ని రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వార్త విన్న చాలా మంది ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News